- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అజ్ఞానపు గూటిలో మోసం గుడ్లు.. రిపబ్లిక్‌లో రియల్ పాలిటిక్స్!
దిశ, సినిమా : డైరెక్టర్ దేవకట్టా – సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘రిపబ్లిక్’ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ప్రజల్లో నెలకొన్న భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే నాయకులు అడ్డదారులు తొక్కేందుకు కారణమవుతుందని ఎత్తిచూపుతోంది. సమాజంలో తిరిగేందుకు అర్హత లేని గుండాలు, హంతకులకు కొమ్ముకాస్తున్న లెజిస్లేటివ్ వ్యవస్థను జ్యుడీషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ గాడినపెట్టాల్సిన అవసరముందని చెప్తోంది.
‘చట్టసభల ఆదేశాల మేరకు ఉద్యోగులు పనిచేయాలి కానీ, ఆ ఆదేశాలు మారణహోమానికి దారితీస్తే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎదురు తిరగాల్సిందే. లేదంటే నాయకులు హిట్లర్లు అవుతారు, సమాజాన్ని దోచేస్తారు’ అని హెచ్చరిస్తోంది. ‘అజ్ఞానం గూడుకట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది’ అని, ప్రజలు మేల్కోవాలని సూచించింది. తాజాగా విడుదలైన ‘రిపబ్లిక్’ దేవకట్టా నుంచి వస్తున్న మరో మాస్టర్ పీస్ అవుతుందని అనిపిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి సూచనల ప్రకారం మూవీని అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.