- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే మూలస్తంభం
దిశ, సూర్యాపేట : ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు మూలస్తంభం లాంటివారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వతంత్య్ర అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేష్ అన్నారు. ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానిక ఎంఎన్ఆర్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ శాసన సభ్యుడిగా ప్రజా సేవ కొరకు తపించే వ్యక్తిగా తనను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విషయంలో ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా లేదని 73, 74 రాజ్యాంగ సవరణ చట్టంతో స్థానిక సంస్థలకు నిధులు నిర్వీర్యం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, తనను గెలిపిస్తే ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కావాల్సిన హక్కులు, నిధులను తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు తప్ప ఆచరణ శూన్యం అని విమర్శించారు. సామాజిక సేవా దృక్పథంతో ఆలోచించి, పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోరారు. నిధులు నియామకాల విషయంలో తెలంగాణ సాధించుకుంటే ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం పాలన కొనసాగడం లేదని ఆయన ఆక్షేపించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతి రమేష్, కౌన్సిలర్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ ప్రమోద్ కుమార్, ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పవన్ కుమార్, నాగరాజు, కార్యదర్శి మీసాలు ఉపేందర్, కటికల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.