- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ మార్కెట్‌లో రెమిడెసివర్.. తెరవెనుక ఎవరు..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించింది. రెండో వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో వైరస్‌బారిన పడుతున్నారు. ఇదే సమయంలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కారణంగా రోగులు మరణిస్తున్నారు. వెంటిలేటర్‌పై కొన ఊపిరితో ఉన్న వారికి కాపాడేందుకు మందు రెసిడెసివర్. కానీ, ఇంజెక్షన్అందుబాటులో లేదంటూ వైద్యులు సైతం చేతులెత్తేస్తున్నారు. రిటైల్ మార్కెట్‌లో రూ. 3 వేల లోపు ఉండాల్సిన ఇంజెక్షన్.. బ్లాక్ మార్కెట్‌లో మాత్రం రూ.4 వేల నుంచి రూ.40 వేలకు విక్రయిస్తున్నారు. ఒక్కో రోగికి 6 ఇంజెక్షన్లు అవసరం కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.
బాధితుల సెల్ఫీ వీడియోలు..
పలు ఆసుపత్రుల్లో చేరిన బాధితులు.. తమకు శ్వాస ఆడటం లేదని, రెమిడెసివిర్ఇంజెక్షన్లు ఇప్పించండంటూ వేడుకుంటున్నారు. వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేసినా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా కుత్బుల్లాపూర్ప్రాంతానికి చెందిన ఓ సీనియర్జర్నలిస్టు తన మనోవేదనను వ్యక్తం చేస్తూ వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. మరో జర్నలిస్టు ఓ ఎమ్మెల్సీని వేడుకుంటే వయల్స్‌ను సప్లయి చేసినా.. వాటిని ఇచ్చారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఎవరెవరికీ, ఎంత మందికి అవసరం?
రాష్ట్రంలో 500 నుంచి 600 వరకు కొవిడ్ఆసుపత్రులు ఉన్నట్లు అంచనా. వీటిలో సీరియస్కేసులు పది వేలు ఉన్నా.. అందులోనూ ఈ రెమిడెసివర్తీసుకునేవారు 50 శాతంగానే ఉంటారని సీనియర్ఫార్మకాలజిస్టు డా.ఆకుల సంజయ్‌రెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్కుతగ్గ ఉత్పత్తి దేశంలో ఉందని.. ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలోని పలు ఫార్మసీ బిజినెస్ చేసేవారే కొరతను సృష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల వారు అయితే కరోనా బాధితులకు ఇంజెక్షన్ తప్పనిసరి చేస్తున్నారని ఆరోపించారు.
ఇవే సాక్ష్యాలు..
తాజాగా లంగర్హౌస్ప్రాంతంలో ఓ ఫార్మసీ షాప్‌పై పోలీసులు దాడి చేశారు. షేక్ మజర్(షాపు యజమాని) నుంచి రెమిడెసివర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. హెటిరోలో రూ.4,500కు కొని రూ.35 వేలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అటు కరీంనగర్‌లో రెమిడెసివర్ ఇంజెక్షన్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని నలుగురిని అరెస్ట్ చేశారు. ఇలా పదుల సంఖ్యలో అక్రమార్కులు దొరికారు. రోగుల ఆందోళనను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
రెమిడెసివర్ మాఫియాకు తెరలేపారు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెమిడెసివర్ఇంజెక్షన్ దందాను మాఫియా నడిపిస్తోంది. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. పెద్ద మొత్తానికి విక్రయిస్తున్నారు. దీనికి సరైన ప్రోటోకాల్ ట్రీట్మెంట్లేదు. ప్రభుత్వం టాస్క్ఫోర్స్కమిటీలను నియమించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌కమిటీ పని చేస్తే అక్రమ దందాలన్నీ బయటికొస్తాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే మరింతగా మాఫియా రెచ్చిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రీట్మెంట్ప్రొటోకాల్, ట్రీట్మెంట్ఫాలో అప్చేయాలి. కేస్షీట్మెయింటెన్చేయాలి. ఖాళీ వయల్స్‌ను సేకరించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తోన్న ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ అక్రమార్కుల దందా ఆగుతుంది. -సీనియర్ఫార్మకాలజిస్టు డా.ఆకుల సంజయ్‌రెడ్డి.