యోగేష్ నీ ఆరోగ్యం ఎలా ఉంది.. మాజీ ఉద్యోగి ఇంటికి రతన్ టాటా

by Anukaran |   ( Updated:2021-01-05 22:11:14.0  )
యోగేష్ నీ ఆరోగ్యం ఎలా ఉంది.. మాజీ ఉద్యోగి ఇంటికి రతన్ టాటా
X

దిశ,వెబ్‌డెస్క్ : రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్. దేశంలో అత్యంత సంపన్నులలో ఒకరైన రతన్ టాటాకు వ్యాపార రంగంలో మిత్రులే తప్ప శత్రువులు లేరంటే ఆయన హుందాతనం, వ్యక్తిత్వం ఏంటన్నది చెప్పవచ్చు. ఇటీవల టాటా కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనారోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా ఆయన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి టాటా కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ అనారోగ్య కారణంగా జాబ్ కు రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఉద్యోగి యోగేశ్ దేశాయ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా మానవత్వం చాటుకున్నారు. ముంబై నుంచి పూణేలోని ఫ్రెండ్స్ సొసైటీలో నివాసం ఉంటున్న ఉద్యోగి ఇంటికి స్వయంగా వెళ్లారు. యోగేష్ నీ ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాగా గతంలో జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో గాయపడ్డ టాటా కంపెనీకి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రతన్ టాటా అండగా నిలుస్తున్నారు.80 మంది ఉద్యోగుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకుంటున్నారు.

Advertisement

Next Story