ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌లో రాశీఖ‌న్నా..?

by Shyam |   ( Updated:2021-06-12 01:55:14.0  )
prabhas news
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టి కుర్రకారు మనసులను దోచుకున్న హీరోయిన్ రాశీఖన్నా. ఇక ఈ సినిమా తర్వాత సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని లేకుండా నటిస్తూ మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ గా మారింది. ఇక ఈ మధ్యనే సన్నజాజి తీగలా సన్నబడి మరింత వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ బ్యూటీ కి జాక్ పాట్ లాంటి ఆఫర్ వచ్చినట్టు టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో రాశీ హీరోయిన్ గా అనుకొంటున్నట్లు తెలుస్తోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇప్పటీకే దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీఖన్నా మరో హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాశీతో నిర్మాతలు మంతనాలు సాగిస్తున్నారని వెల్లడైంది. ఇక ఈ సినిమా రాశి పాత్ర టీఎలా ఉండబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఈ సినిమాలో రాశీ కన్ఫర్మ్ ఐతే ఈ అమ్మడు నిజంగా జాక్ పాట్ కొట్టినట్లే.

రాశీ కి ఇదే తొలి పాన్ ఇండియన్ సినిమా. పైగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో ఆఫర్ అనగానే రాశీ దశ దిశ తిరిగిపోవడం ఖాయమేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సివుండగా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్ లాంటి నటుల మధ్య రాశీ ఎలా నటిస్తుందో చూడాలి.

Advertisement

Next Story