కేంద్ర ఎన్నికల కమిషనర్‎గా రాజీవ్ కుమార్..!

by Shamantha N |
కేంద్ర ఎన్నికల కమిషనర్‎గా రాజీవ్ కుమార్..!
X

దిశ వెబ్‎డెస్క్: కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‎గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. గత నెల 18న రాజీనామా చేసిన అశోక్ లవాసా స్థానంలో నియమితులైన రాజీవ్ కుమార్.. మంగళవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్.. ఝార్ఖండ్ కేడర్‎కు చెందినవారు. 30 ఏళ్లకు పైగా ఎన్నో కీలకమైన బాధ్యతలను రాజీవ్ కుమార్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో ఆయన సేవలను అందించారు.

Advertisement

Next Story