- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్: జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షాకింగ్‌గా మారింది. అక్రమాస్తుల కేసుల్లో సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇవాళ వెల్లడించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానని, ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
సీఎం పదవిని తన భార్య భారతికి ఇస్తారో లేదా తల్లి విజయమ్మకి ఇస్తారో జగన్ ఇష్టం అని RRR వ్యాఖ్యానించారు. కేవలం ఆరోపణలు వచ్చినందుకే మహారాష్ట్ర హోమంత్రి తన పదవికి రాజీనామా చేశారని, ఆయనను జగన్ ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదని ప్రశ్నించారు. తన కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి జగన్ రాజకీయ పదవులతో పాటు ప్రభుత్వ పదవులు ఇచ్చారని, ఇంత జరుగుతుంటే సీబీఐ ఏం చేస్తోందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కాగా, వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో గత కొంతకాలంగా ఆ పార్టీకి రఘురామకృష్ణంరాజు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.