- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాజీనామా చేయను.. నా లోక్‌సభ సభ్యత్వం రద్దనేది కల: ఎంపీ రఘురామకృష్ణంరాజు
దిశ, ఏపీ బ్యూరో: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. తాను రాజీనామా చేసినట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను రాజీనామా చేయబోనన్నారు. అలాగే తన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు అవ్వడం కల మాత్రమేనని పేర్కొన్నారు. తాను స్పీకర్‌కి వివరణ అందిస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీ ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. మరోవైపు తనకు వన్ మిలియన్ యూరో ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. పేపర్లలో కూడా ఈ అంశం గురించి వచ్చిందన్నారు. ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు వేస్తున్నారని ఎంపీ రఘురామ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వార్తలు బార్ అండ్ బెంచ్‌లో వచ్చినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఎందుకు ఇంతలా దిగజారీ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
లోక్‌సభలో ఆందోళనపై ఆహ్వానం అందలేదు
రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రధాని మోడీ ఉండగానే దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదాపై సడెన్‌గా సభలో ఆందోళన చేస్తామని వైసీపీ ప్రకటించడంపై సెటైర్లు వేశారు. ఇవ్వన్నీ చిత్తశుద్ధితో చేస్తే బాగుంటుందని విమర్శించారు. లోక్‌సభ ఆందోళనపై తనకైతే ఆహ్వానం లేదన్నారు. మరోవైపు నామినేటెడ్ పదవులపైనా పంచ్‌లు వేశారు. కొత్తగా కార్పొరేషన్ల పదవులు వేశారని…ప్రజలు మర్చిపోయిన కులాలను గుర్తు చేసి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రాధాన్యత కలిగిన శాఖలు ఒక సామాజికవర్గానికి మాత్రమే కట్టబెట్టారన్నారు. అప్రాధాన్య పదవులు ఇతరులకు కేటాయించారని.. సామాజిక న్యాయం పాటించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంపీ రఘురామ విమర్శించారు.