- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకెండ్ వేవ్‌తో దెబ్బతిన్న ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 10.07 శాతం తగ్గాయని వాహన తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది. ఏప్రిల్‌లో మొత్తం ప్యాసింజర్ కార్లు 2,61,633 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 10.07 శాతం క్షీణించినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యూఫాక్చరర్స్(సియామ్) గణాంకాలు తెలిపాయి. కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆటో కంపెనీలన్నీ దేశవ్యాప్తంగా తమ ప్లాంట్‌లను మూసేయాల్సి వచ్చిందని, అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షల వల్ల డీలర్‌షిప్‌లు మూసేయాల్సి రావడంతో అమ్మకాలు పడిపోయాయని సియామ్ నివేదిక పేర్కొంది.
టూ-వీలర్ విభాగంలో అమ్మకాలు 33.52 శాతం తగ్గి 9,95,097 యూనిట్లకు చేరుకున్నాయని, త్రీ-వీలర్ విభాగంలో 57.01 శాతం క్షీణించి 13,728 యూనిట్లు అమ్ముడైనట్టు నివేదిక వివరించింది. మోటార్ స్కూటర్ల అమ్మకాలు 34 శాతం క్షీణించి 3,00,462 యూనిట్లుగా నమోదయ్యాయి. “దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ కఠిన నిబంధనల వల్ల సరఫరాలో ఆటంకాలు ఉన్నాయి. డీలర్‌షిప్‌లు మూసేయడం, ఉన్న అరాకొరా డీలర్‌షిప్‌లలో వినియోగదారులు లేకపోవడంతో అమ్మకాలపై ప్రభావం అధికంగా ఉందని” సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు.