అమిత్ షాను కలవనున్న పంజాబ్ సీఎం

by Shamantha N |
అమిత్ షాను కలవనున్న పంజాబ్ సీఎం
X

దిశ, వెబ్‎డెస్క్: నేడు ఢిల్లీలో కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కలవనున్నారు. కాసేపట్లో అమిత్ షా, అమిత్ షా మధ్య కీలక సమావేశం జరగనుంది.

రైతులతో మంగళవారం నాడు జరిగిన చర్చలు అసంపూర్ణంగా మిగిలాయన్న సంగతి తెలిసిందే. రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలపగా.. రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తక్షణమే వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు అనుకూలంగా నిర్ణయం వెలువడకుంటే ఢిల్లీ రోడ్లను దిగ్భంధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story