చంద్రబాబు, బీజేపీలపైనే ప్రజాగ్రహం: ఎమ్మెల్యే రోజా

by srinivas |   ( Updated:2021-12-29 02:41:36.0  )
చంద్రబాబు, బీజేపీలపైనే ప్రజాగ్రహం: ఎమ్మెల్యే రోజా
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ప్రజాగ్రహ సభ ఎందుకో కూడా ఆ పార్టీ నేతలకే తెలియదంటూ సెటైర్లు వేశారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, బీజేపీపైనే ఆగ్ర‌హంగా ఉన్నార‌ని.. వైసీపీపై ఆప్యాయత చూపుతున్నారని చెప్పుకొచ్చారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీలు మరింత నష్టపరిచాయని విమర్శించారు. బీజేపీ-టీడీపీలు కలిసి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాయ‌ని విమర్శించారు. అంతేకాదు బీజేపీ ప్రజాగ్రహ సభ వెనుక టీడీపీ ఉందంటూ రోజా ధ్వజమెత్తారు. టీడీపీ నేత‌లే బీజేపీలో చేరార‌ని గుర్తు చేసిన రోజా టీడీపీ నేత‌లు రాసిచ్చిన స్క్రిప్టుని బీజేపీ నేత‌లు చ‌దివారంటూ ధ్వజమెత్తారు. ప్రజాగ్రహ సభలో విభ‌జ‌న‌ హామీల‌ గురించి ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీపైనా.. రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిన చంద్రబాబుపైనే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అందుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌కు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేదు..

రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలే థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారని చెప్పుకొచ్చారు. టికెట్‌ రేట్లు ఫిక్స్‌డ్‌గా ఉంటేనే థియేటర్లో సినిమా చూసేవారికి మరింత ఆనందం ఉంటుందన్నారు. మరోవైపు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య విబేధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను రోజా కొట్టి పారేశారు. ఎలాంటి గ్యాప్‌ లేదని క్లారిటీ ఇచ్చారు. జగన్‌ లాంటి ఫ్రెండ్లీ నేచర్‌ ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆన్‌లైన్ టికెట్ విధానం సినీ పెద్దల ప్రతిపాదనేనని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు ఇతరులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని రోజా గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed