పంజాబ్‌లో ప్రజలు గుమికూడటం నిషేధం

by Shamantha N |
పంజాబ్‌లో ప్రజలు గుమికూడటం నిషేధం
X

ఛండీగడ్: ప్రజలు బహిరంగంగా గుమికూడటాన్ని పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. అయితే, సంప్రదాయాలు, సామాజిక రీత్యా గుమిగూడే అవసరాలపైనా ఆంక్షలు విధించింది. పెళ్లి సహా వేడుకలకు 50 మందికి బదులు 30 మందికి అనుమతి, ఇతర సంప్రదాయాలకైతే ఐదుగురికి మించవద్దని ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఇందుకు పోలీసులు, పాలనాధికారులు పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ఉల్లంఘించినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపింది. ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ఇతర వేదికలపైనా ఆంక్షలు విధించింది.

Advertisement

Next Story

Most Viewed