ఒకే దేశం.. ఒకే విద్య : ప్రధాని

by Anukaran |   ( Updated:2023-08-18 15:27:15.0  )
ఒకే దేశం.. ఒకే విద్య : ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ విద్యావిధానంపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలని స్పష్టం చేశారు. దీనికనుగుణంగానే రాష్ట్రాలన్నీ కొత్త జాతీయ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. కొత్త జాతీయ విద్యావిధానికి నేను పూర్తిగా మద్దతిస్తున్నానని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను చదువుకునేలా వీలు కల్పిస్తున్నామని తెలిపారు.

జాతీయ విద్యావిధానంలో ఎన్నో కొత్త సంస్కరణలు తెచ్చామన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యానే కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. నర్సరీ నుంచి పీజీ వరకూ విద్యారంగంలో సమూల మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త విద్యావిధానంతో భావితరాలకు ఎంతో ఉపయుక్తం అని అన్నారు.

21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఈ నూతన జాతీయ విద్యావిధాన్ని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా మేధావులు దీనిపై విస్తృతంగా చర్చించాలని సూచించారు. ప్రస్తుత విద్యావిధానంలో ఎన్నో లోపాలున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed