- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభాస్‌కు షాక్ ఇచ్చిన ఫ్యాన్..
దిశ, సినిమా: అభిమాన హీరోల కోసం ఎంతకైనా తెగించే ఫ్యాన్స్.. ఆ ప్రేమను తెలిపేందుకు నమ్మశక్యం కాని పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో హీరోలు సైతం ఫ్యాన్స్ అభిమానానికి కృతజ్ఞత చూపిస్తుంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే ఈ విషయంలో అందరికంటే ముందుంటాడు. తాజాగా డార్లింగ్ వీరాభిమాని ఒకరు.. తలపై ‘ప్రభాస్’ అనే అక్షరాలు కనిపించేటట్లుగా గుండు కొట్టించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాహుబలి స్టార్.. అతడిని పిలిపించి సరదాగా మాట్లాడటమే కాకుండా ఒక వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఈ మేరకు ప్రభాస్, అభిమానితో ముచ్చటిస్తున్న ఫొటో, గిఫ్ట్ వాచ్ పిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రభాస్ చూపించిన ప్రేమకు ఫిదా అయిన ఫ్యాన్స్.. ‘మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్’ అంటూ పాన్ ఇండియా స్టార్‌కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
కాగా.. ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఇటీవలే ఓ అభిమాని రాసిన సూసైడ్ నోట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రభాస్-పూజా హేగ్డే జంటగా నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- Tags
- fans