త్వరలో అటవీశాఖలో పోస్టులు భర్తీ

by srinivas |
త్వరలో అటవీశాఖలో పోస్టులు భర్తీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఖాళీగా ఉన్న సుమారు 1500 పోస్టులను దశలవారీగా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని అటవీశాఖాధికారి ప్రతీప్​ కుమార్​ తెలిపారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ ​వల్ల భర్తీ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23శాతం అటవీ విస్తీర్ణం ఉందని, జాతీయ అటవీ విధానం ప్రకారం మరో 10శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటవీ శాఖలో 40శాతం సిబ్బంది కొరత ఉన్నందున, త్వరలో 540క్షేత్రస్థాయి పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇంకో వెయ్యి పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అటవీ విస్తీర్ణం తగ్గి పట్టణీకరణ పెరగడం వల్ల జంతువులు జనావాసాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాలో ఏనుగులు సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story