నాయబ్ తహశీల్దార్లకు పోస్టింగులు

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: ఐదేండ్ల క్రితం పోటీ పరీక్ష రాసి, ఇంటర్వ్యూలకు హాజరై పోస్టింగులకు కోసం ఎదురుచూస్తోన్న 259మందికి ఊరట లభించింది. టీఎస్పీపీఎస్సీ నిర్వహించిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన నాయబ్ తహశీల్దార్లకు పోస్టింగులు ఇస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వారికి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టర్ రిక్రూట్మె్ంట్) ఆదేశాల మేరకు జిల్లాలను కేటాయించారు. ఈ మేరకు వారికి జోన్లను కేటాయించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 9న ‘జాబ్ లేక కూలీకి.. లేబర్ పనుల్లో గెజిటెడ్ ఆఫీసర్లు’ శీర్షికన ఎంపికైన ఉద్యోగుల కష్టాలపై ‘దిశ’ దినపత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. నోటిఫికేషన్ నం.20/2015&17?2016 ద్వారా 259 మంది డిప్యూటీ తహశీల్దార్లుగా, 289 మంది ఎక్సైజ్ సబ్ ఇన్సెపెక్టర్లుగా ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకొని ఐదు నెలలు గడిచినా పోస్టింగులు ఇవ్వకపోవడం, ఉన్న ఉపాధి, ఉద్యోగం కోల్పోయి వాళ్లు పడుతోన్న వేదనను వివరించాం. అలాగే రెండు సార్లు మంత్రి కేటీఆర్ కు, పలుమార్లు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం దక్కలేదని కథనం పేర్కొంది. ఎట్టకేలకు ఐదు నెలల తర్వాత పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఉద్యోగార్ధులు ఆనందంలో మునిగారు.

Advertisement

Next Story

Most Viewed