KA Paul : ట్రంప్ నాకు మంచి స్నేహితుడు..ప్రపంచ శాంతికి కృషి చేయాలి : కేఏ పాల్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-07 15:24:51.0  )
KA Paul : ట్రంప్ నాకు మంచి స్నేహితుడు..ప్రపంచ శాంతికి కృషి చేయాలి : కేఏ పాల్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడి(President of the United States)గా మరోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 1994నుంచి నాకు మంచి స్నేహితుడని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ కు కేఏ పాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికన్లలో 92% మంది కమలహారిస్ ను సపోర్ట్ చేశారని.. కానీ ఓడిపోయారని.. ట్రంప్ మాత్రం రికార్డు స్థాయిలో విజయం సాధించారన్నారు. ఎవరు కూడా ట్రంప్ గెలుస్తారని ఊహించలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కమల హరీస్ కు సపోర్ట్ చేశారని.. కానీ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కు సపోర్ట్ చేస్తున్నాని చెప్తున్నారని, అది సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలంటూ సూచించారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టనున్నారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు సొంతంచేసుకున్నారు. జేడీ వాన్స్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed