- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బీఆర్కే భవన్‌లో అధికారుల అత్యుత్సాహం.. తీవ్ర అసంతృప్తిలో చైర్మన్లు
దిశ, తెలంగాణ బ్యూరో: కమిషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించి, సదుపాయాలు, ప్రోటోకాల్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా...కొన్ని శాఖల్లోని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్వయంగా ఆయా చైర్మన్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టాఫ్, సౌలత్‌లు కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారని మండిపడుతున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత మంది చైర్మన్లు..ఆఫీసర్లపై సీరియస్‌గా ఉన్నారు. సమీక్షలు, శాఖల రివ్యూల్లో తమకు అవకాశం కల్పించడం లేదని మరొ కొంత తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. ప్రభుత్వం ఫస్ట్ రౌండ్ 37 మంది కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించింది. ఆ తర్వాత రైతు, విద్యా, బీసీ తదితర కమిషన్లు వేసింది. కానీ యభై శాతానికి పైగా కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులు, చైర్మన్ల మధ్య సమన్వయం ఉండడం లేదు. ఇదే అంశంపై ఒకరిద్దరు చైర్మన్లు సీఎంవో అధికారులకు వివరించినట్లు సమాచారం.
కీలక కమిషన్‌లో జీరో..?
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను సక్రమంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో రైతు కమిషన్‌ను నియమించింది. ఇందుకు రైతుల పరిస్థితిపై సమగ్రమైన అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ కమిషన్‌కు బీఆర్కే భవన్‌లో ఆఫీస్ కేటాయించారు. కానీ కనీస వసతులు, కమిషన్కు కావాల్సిన అధికారులు, సిబ్బంది లేక పరేషాన్ అవుతున్నామని స్వయంగా మెంబర్లు చెప్తున్నారు. చాంబర్లు ఏర్పాటు చేయడంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం చైర్మన్ కోదండరెడ్డి కోసం ఒక ఛాంబర్ ఏర్పాటు చేయగా, అందులో డోర్ లేని వాష్ రూమ్ ఉన్నది. వాష్ రూమ్‌కు వెళ్లాలంటే, మరొకరు అక్కడ ఉండాల్సి వస్తుందని కమిషన్ మెంబర్లు వివరించారు. బాధ్యతలు తీసుకున్న మెంబర్లు భవానీరెడ్డి, చెవిటి వెంకన్న, గడుగు గంగాధర్‌లు చైర్మన్ రూమ్‌లోనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సిచ్వేషన్ చూసిన ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్, తనకు ఈ పదవీ వద్దే వద్దంటూ ప్రభుత్వంలోని కీలక పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎంకు అత్యంత ప్రీతి కలిగిన వ్యవసాయ శాఖలో ఈ పరిస్థితిని చూసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు తమ సొంత టీమ్‌తో పని చేయించుకోవాల్సిన వస్తుందని సమాచారం.