- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి విమాన గోపురానికి మెరుగులు.. 15 నుంచి బంగారు తాపడం పనులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 15 నుంచి యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం అమర్చే పనులు ప్రారంభమవుతాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. 2025 మార్చి 1 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నందున ఈ లోగా పనులు పూర్తి చేయాలని ఈవో భాస్కర్ రావును ఆదేశించారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ), దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పై సమీక్షించారు. తాపడం కోసం 60 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిపి మొత్తం రూ.8కోట్లను వెచ్చించామని ఈఓ వివరించారు. మొత్తం 10 వేల చదరపు అడుగుల బంగారం తాపడం సంబంధిత పనులకు గాను ఇప్పటి వరకు 1600 చదరపు అడుగుల పని పూర్తయిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులు పూర్తయిన తర్వాత విమాన గోపురానికి సీఎం రేవంత్ రెడ్డి మహా కుంభాభిషేకం జరిపిన తర్వాత బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం గుట్టదే కావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. దాతల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
వైటీడీఏ ఆధ్వర్యంలో దేవాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి మొత్తం 1241.36 ఎకరాల భూమి సేకరించామని వైస్ చైర్మన్ కిషన్ రావు మంత్రికి తెలిపారు.ఆలయ భవిష్యత్ అవసరాలకు సేకరించాలనుకున్న 101.10 ఎకరాల భూమికి సంబంధించిన ఫైలును కలెక్టర్‌కు అందజేశామని, అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. మరోసారి సమీక్షించిన తర్వాత భూమిని సేకరించేది లేనిది తెలియజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గాలి గోపురం విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన 162 మందికి అందించనున్న షెట్టర్ల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించాలని నిర్దేశించారు. శుక్రవారం యాదాద్రిలో సీఎం సమీక్ష నేపథ్యంలో కచ్చితమైన వివరాలతో రావాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ దాతల విరాళాలతో చేపట్టిన పనులను ఈఓ మంత్రికి వివరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేఎస్ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత్ కొండిబా, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్లు కృష్ణవేణి, జ్యోతి, ఆర్జేసి రామకృష్ణారావు, వైటీడీఏ ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.