- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NRI: ఎన్నారైలకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐతో పైసా ఖర్చు లేకుండా ఇండియాకు డబ్బులు పంపొచ్చు..!
దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నారై(NRI)లు కూడా ఇక నుంచి రూపాయి ఖర్చు లేకుండా విదేశాల నుంచి భారత్(India)లోని కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఇతరులకు యూపీఐ(UPI) ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇందుకోసం NRE (Non-Resident External) లేదా NRO (Non Resident Ordinary) అకౌంట్లను ఎన్నారైలు కలిగి ఉండాలని, దీంతోపాటు అంతర్జాతీయ మొబైల్ నంబర్ల(International Mobile Numbers)ను యూపీఐ ఐడీ(UPI ID)లతో లింక్ చేసి ఉండాలని వెల్లడించింది. కాగా ఎన్పీసీఐ తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా ఎన్నారైలు రోజుకు గరిష్టంగా లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే కొత్తగా యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకున్న 24 గంటలో కేవలం రూ.5000 మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసేందుకు వీలుంటుంది. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, UK, UAE, ఫ్రాన్స్, ఖతర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, ఒమన్, మలేషియా దేశాల్లోని ఎన్నారైలకు ఇది వర్తిస్తుంది.