- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్రలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 9 ర్యాలీలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ర్యాలీ ధూలేలో శుక్రవారం జరగనుంది. ఈ మేరకు బీజేపీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 12వ తేదీన పూణెలో ప్రధాని మోడీ ఓ రోడ్ షో నిర్వహించనున్నట్టు వివరించింది. నడేు మధ్యాహ్నం ధూలేలో ర్యాలీ ఉంది. తర్వాత నాషిక్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతారు. నవంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అకోలాలో, మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో క్యాంపెయిన్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. 12వ తేదీన చిమూర్, సోలాపూర్‌లలో నిర్వహించే ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం పూణేలో ఓ రోడ్ షోలో ప్రసంగిస్తారు. నవంబర్ 14వ తేదీన ఛత్రపతి శంభాజీ నగర్, రాయిగడ్, ముంబయిలలో నిర్వహించే ర్యాలీల్లో ప్రధాని మాట్లాడుతారు.