T20 Series :‘నో’ రివేంజ్ .. టీం పర్ఫామెన్స్‌పైనే ఫోకస్ : సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్

by Mahesh Kanagandla |
T20 Series :‘నో’ రివేంజ్ .. టీం పర్ఫామెన్స్‌పైనే ఫోకస్ : సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో టీం పర్ఫామెన్స్‌పైనే దృష్టి సారించామని సౌతాఫ్రికా కెప్టెన్ ఈడెన్ మార్క్‌రమ్ అన్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రీ మ్యాచ్‌గా దీన్ని చూడకూడదన్నారు.అయితే బార్బడోస్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం తొలిసారి భారత్ ప్రొటియస్ జట్టుతో పొట్టి ఫార్మాట్‌లో తలపడనుంది. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మార్క్‌రమ్ మాట్లాడుతూ.. రివేంజ్ మైండ్ సెట్‌తో కాకుండా సొంతగడ్డపై ఇండియాతో తలపడుతున్నామన్న ఉద్దేశంతో బరిలోకి దిగుతామన్నాడు. ఈ సిరీస్ తమకు ఖచ్చితంగా ముఖ్యమైనదన్నాడు. ఇండియా తాజా ఫామ్‌పై తమకు అవగాహన ఉందని.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భారత్ విజయం సాధించిందని గుర్తు చేశాడు. టీ20 వరల్డ్ కప్ ఓటమి అంశంపై కాకుండా ఈ సిరీస్ పైనే తమ దృష్టి ఉందన్నారు. రెండు దేశాలు తలపడుతున్న టీమ్‌లో చాలా మార్పులు జరిగాయన్నాడు. స్వదేశంలో ఇండియాతో ఆడటం ఎప్పటికీ తమకు ఉత్సాహంగా ఉంటుందన్నాడు.

Advertisement

Next Story

Most Viewed