Sunita Williams : సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నాసా

by M.Rajitha |
Sunita Williams : సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నాసా
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష క్షేత్రం(ISS)లో ఉన్న వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) అనారోగ్యం పాలైనట్టు వస్తున్న కథనాలపై నాసా(NASA) క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నట్టు ప్రకటించింది. సునీతాతోపాటు మిగిలిన వారు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు నాసా పేర్కొంది. అంతరిక్షంలో బరువుతగ్గి, నీరసంగా ఉన్నట్టు కనిపించే సునీతా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అనేకమంది నాసాను ట్యాగ్ చేస్తూ ఎక్స్(X) లో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో నాసా.. సునీతాతోపాటు మిగిలిన వ్యోమగాముల ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చింది. సునీతా కేవలం పోషకాహార లోపంతో బాధపడుతోంది తప్ప ఇతరత్రా కారణాలు ఏవీ లేవని తెలియ జేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story

Most Viewed