- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Railway Jobs: నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ జాబ్స్.. పోస్టులు, అర్హత తదితర వివరాలివే..!
దిశ, వెబ్డెస్క్: అస్సాం(Assam) రాష్ట్రం గువాహటి(Guwahati)లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC)- నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే(NFR) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 5,647 యాక్ట్ అప్రెంటిస్(Act Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు కతిహార్, తింధారియా, రంగియా, దిబ్రుగర్, మాలిగావ్ తదితర ప్రాంతాల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.nfr.indianrailways.gov.in. ద్వారా ఆన్లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 4న ప్రారంభమైంది. అప్లై చేసుకోడానికి చివరి తేదీ 3 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
యాక్ట్ అప్రెంటిస్ - 5,647
విద్యార్హత:
పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ,12వ తరగతి, MLT పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
మెట్రిక్యూలేషన్, ఐటీఐ మార్క్స్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ,మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.