- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి : ఎమ్మెల్యే వెంకట్రావు
దిశ, భద్రాచలం : మారుమూల గిరిజన గ్రామాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ఆ మేరకు వైద్యుల నియామకం, నూతన పీహెచ్సీ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, మెడికల్ ఆఫీసర్లు ఐటీడీఏ యూనిట్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కొత్త పీహెచ్సిలు, సబ్ సెంటర్లు, సిటీ స్కాన్ మెషిన్లు, ట్రామా కేర్ సెంటర్లు, మొబైల్ మెడికల్ అంబులెన్స్, త్వరితగతిన నిర్మాణం చేపట్టి ఆదివాసీ గిరిజనులకు ప్రైవేటుకు దీటుగా అధునాతన పరికరాలతో వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు.
ఐటీడీఏ ల పరిధిలోని గిరిజనులు తమ నివాస ప్రాంతాల నుంచి అరగంటలోనే ఆసుపత్రికి చేరుకోవడానికి పీహెచ్సీలు, సబ్ సెంటర్లో డాక్టర్లు, సిబ్బంది అవసరమైన చోట బైక్ అంబులెన్సుల ద్వారా మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అదేవిధంగా ఏజెన్సీ డ్రగ్స్ స్టోర్ ఐటీడీఏ ప్రాంగణంలో, టీ హబ్ సెంటర్ భద్రాచలంలోని ఏరియా హాస్పిటల్ లో వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డీఎంహెచ్వోకు ఆదేశించారు.
మారుమూల ప్రాంతాల్లో సబ్ సెంటర్ల కి, పీహెచ్సికి అరగంటలో చేరుకునే దారి సౌకర్యం ఉండే విధంగా చూడాలని అన్నారు. ఏరియా ఆసుపత్రి వైద్యుల పనితీరు బాగోలేదని, కొందరు వైద్యులు పరీక్షలు బయట చేపించుకుని రమ్మని, మందులు బయటకు రాస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో భాస్కర్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ రామకృష్ణ, డాక్టర్ చైతన్య, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, పి సి హెచ్ ఎస్ రవిబాబు డి ఈ హరీష్, మరియు వివిధ సబ్ సెంటర్లు పీహెచ్ సి ల నుండి వచ్చిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.