- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఎకో టూరిజం ఏర్పాటుకు భూమి కేటాయింపు
దిశ,నిజాంసాగర్ : ఎకో టూరిజం ఏర్పాటుకు 12 ఎకరాల 30 గుంటల భూమిని కేటాయించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును ఎకో టూరిజంగా ఏర్పాటు చేసేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు నిజాంసాగర్ మండల తహసీల్దార్ భిక్షపతి అచ్చంపేట గ్రామ పంచాయతీ శివారులోని ప్రాజెక్టు వద్ద గోల్ బంగ్లా ప్రాంతంలో గల ప్రభుత్వ భూమి 121/2A సర్వే నెంబర్ లోని 12 ఎకరాల 30 గుంటల భూమిని టూరిజం శాఖకు కేటాయించారు.
దీంతో గురువారం తహసీల్దార్ భిక్షపతి, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నీటి పారుదల శాఖ ఏఈఈ శివ ప్రసాద్ సమక్షంలో భూమిని పూర్తి స్థాయి సర్వే నిర్వహించి టూరిజం శాఖ అధికారులు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ రామమూర్తికి భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఏఈ సోహెల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా, సర్వేయర్ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ మల్లేశం, నాయకులు లక్ష్మయ్య, డాక్టర్ నారాయణ, బంగ్లా ప్రవీణ్ కుమార్, గాండ్ల రమేష్, డాక్టర్ గోపాల్, కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.