Australia vs India, 1st Test : విరాట్ సెంచరీ...అస్ట్రేలియాకు 534 పరుగుల భారీ టార్గెట్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-24 09:55:34.0  )
Australia vs India, 1st Test : విరాట్ సెంచరీ...అస్ట్రేలియాకు 534 పరుగుల భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ మొదటి టెస్టులో అస్ట్రేలియా ముందు 534పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య చేధనకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అసీస్ ఓపెనర్ స్విన్నీ(0), నైట్ వాచ్ మెన్ కమిన్స్(2), లబుషైన్(3) వికెట్లు కొల్పోయి ఆట ముగిసే సమయానికి 12పరుగులు చేసింది. బూమ్రా 2, సిరాజ్ కు 1వికెట్ సాధించారు. తొలి టెస్టు మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 6వికెట్లకు 487పరుగుల వద్ధ డిక్లెర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ 48పరుగుల ఆధిక్యతను కలుపుకుని అసీస్ కు 534పరుగుల లక్ష్యాన్ని విధించింది.

టీమిండియా ఆటగాళ్లలో యశస్వీ జైస్వాల్ 297బంతుల్లో 161, కేఎల్ రాహుల్ 176బంతుల్లో 77పరుగులు, దేవదత్ పడిక్కల్ 71బంతుల్లో 25, విరాట్ కోహ్లీ 143బంతుల్లో 100*పరుగులు, వాషింగ్టన్ సుందర్ 94బంతుల్లో 29, నితీష్ రెడ్డి 27బంతుల్లో 38*పరుగులతో అసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అసీస్ బౌలర్లలో స్పిన్నర్ లయన్ 2వికెట్లు, కమిన్స్, స్టార్క్ , హెజల్ వుడ్, మార్ష్ తలో వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 150పరుగులు, అసీస్ 104పరుగులు మాత్రమే చేశాయి

Advertisement

Next Story