కెమెరాల్లో పక్షుల అందాలు

by Sridhar Babu |
కెమెరాల్లో పక్షుల అందాలు
X

దిశ, మామడ : మండలంలోని నల్దుర్తి గ్రామ సమీపంలోని తురకం చెరువు అలాగే పొన్కల్ గ్రామంలోని యంగన్న చెరువులను ఆదివారం ఐటీ కోస్ బృందం సభ్యులు ,అటవీ శాఖ అధికారులు సందర్శించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గల ఈ చెరువులకు వివిధ రాష్ట్రాల నుంచి పక్షులు వలసలు రావడంతో వాటిని తిలకించేందుకు హైదరాబాద్​ నుంచి ఐటీ బృందం సభ్యులు వచ్చి కెమెరాల్లో బంధించుకున్నారు.

వివిధ రకాల పక్షులు చెరువుల వద్దకు రావడంతో వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి అందాలు చూస్తుంటే మనసు పులకరించి పోతుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఎలిసన్, సీఎఫ్ సర్వానంద్, డీఎఫ్ఓ నాగిని భాను, ఎఫ్డీ ఓ లు భవాని శంకర్, రవీందర్, ఎఫ్ ఆర్ ఓ లు శ్రీనివాసరావు, అవినాష్, రామకృష్ణ, అనిత, ఎఫ్ ఎస్ ఓ లు సంధ్య, శ్రీనివాస్, అన్నపూర్ణ, 40 మంది ఐటీ కోస్ బృందం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed