Gautam Adani : గౌతమ్ అదానీ కేసులో మరో కీలక పరిణామం

by Y. Venkata Narasimha Reddy |
Gautam Adani : గౌతమ్ అదానీ కేసులో మరో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : గౌతమ్ అదానీ(Gautam Adani )పై అమెరికా(America case)లో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందడానికి రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని యూఎస్ ఎస్ఈసీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 21 రోజుల లోపు సమాధానం ఇవ్వాలని.. లేదా తీర్పు వ్యతిరేకంగా వెలువడుతుందని యూఎస్ ఎస్ఈసీ హెచ్చరికలు చేసింది. లంచం ఆరోపణలపై కోర్టుకు సమాధానం తెలియపరచాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, సాగర్‌కు చెందిన బోదక్ దేవ్ నివాసానికి ఈ సమన్లు పంపించింది.

కేసు పూర్వపరాల్లోకి వెళితే 2020-24 మధ్య కాలంలో భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.2,200 కోట్లు లంచాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని న్యూయార్క్ కోర్టులో అదానీలపై కేసు నమోదైంది. లాభదాయకమైన సోలార్ పవర్ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఈ లంచాలు ఇచ్చారనేది అభియోగం. ఈ మేరకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబనేస్‌లపై అమెరికా ఎస్ఈసీ అభియోగాలు మోపింది. అదానీ గ్రీన్ సంస్థపై మోపిన నేరారోపణ ఆ సంస్థ మొత్తం వ్యాపారంలో 10 శాతానికి మాత్రమే సమానమని పేర్కొంది. అయితే.. స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన 11 కంపెనీల అదానీ గ్రూప్ సంస్థలు ఏ ఒక్కటి కూడా తప్పు చేయలేదని ఆ గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ రాబీ సింగ్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed