కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

by Sridhar Babu |
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
X

దిశ, కొత్తగూడెం : విద్యార్థి దశ నుండే కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన పాల్వంచలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థినులతో తో కలిసి భోజనం చేస్తూ వారితో మాట్లాడారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. వసతి గృహ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థినులకు అందిస్తున్న భోజనానికి సంబంధించిన సరుకులు, బియ్యం నాణ్యతను పరిశీలించారు. వసతి గృహానికి ఏమైనా కావాల్సి ఉంటే తెలియజేయాలని సిబ్బందిని కోరగా సోలార్ ద్వారా నీళ్లను వేడి చేసే పరికరం కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారిణి దాసరి అనసూయ, ఏఎస్సీడబ్ల్యూ ఓ హనుమంతరావు, హాస్టల్ వార్డెన్ మహబూబ్ బి పాల్గొన్నారు.

Advertisement

Next Story