- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP TRANSCO: ఏపీ ట్రాన్స్ కోలో కార్పొరేట్ లాయర్ పోస్టులు.. అర్హత, జీతం వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada)లోని ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(AP Transco) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 05 కార్పొరేట్ లాయర్(Corporate Lawyer) పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptransco.gov.in/ ద్వారా డిసెంబర్ 10 లోపు ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టు పేరు, ఖాళీలు:
కార్పొరేట్ లాయర్ - 05
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు మూడేళ్ల LLB/LLM లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. అలాగే నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
వయోపరిమితి లేదు.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
ప్రొఫెషనల్ ఫీజు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,12,000 ప్రొఫెషనల్ ఫీజు చెల్లిస్తారు.