CSK: తిరిగి చెన్నై జట్టుకు చేరిన రవిచంద్రన్ అశ్విన్

by Mahesh |
CSK: తిరిగి చెన్నై జట్టుకు చేరిన రవిచంద్రన్ అశ్విన్
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) 2024 ఐపీఎల్(IPL) 17 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడాడు. కాగా 2025 మెగా వేలం(Mega Auction) కోసం జట్టు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకొని.. అశ్విన్ ను వేలంలోకి వదిలేసింది. ఈ క్రమంలో వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలో నిలవగా.. అశ్విన్ (Ravichandran Ashwin)ను కొనేందుకు హైదరాబాద్, ఆర్సీబీ, లక్నో, రాజస్థాన్, చెన్నై జట్లు పోటీ పడ్డాయి. దీంతో అశ్విన్ ధర వేలంలో అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో చెన్నై జట్టు అతన్ని 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ లో తన కెరీర్‌ను చెన్నైతోనే ప్రారంభించిన అశ్విన్ తిరితి తన సొంత జట్టులోకి వచ్చి చేరాడు. అశ్విన్ రాకతో చెన్నై జట్టు బౌలింగ్ విభాగంలో మరింత బలంగా చేరడంతో పాటు కెప్టెన్ గైక్వాడ్ కు అశ్విన్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే చెన్నై జట్టు వేలంలో అశ్విన్ ను కొన్న వెంటనే CSK అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సింహం తిరిగి జట్టులోకి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed