- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డీజీపీ రేసులో ఆ ఏడుగురు.. యూపీఎస్సీకి జాబితా పంపిన సర్కార్

దిశ, వెబ్‌వెస్క్: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) పదవిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతోన్న డా.జితేందర్ (Jitender) ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆ స్థానంలో ఎవరిని కొత్త డీజీపీగా నియమించాలనే అంశంపై సర్కార్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను రూపొందించి ఇవాళ యూపీఎస్సీ (UPSC)కి పంపింది. అయితే, అధికారుల అర్హతలు, ట్రాక్ రికార్డ్ (Track Record), సర్వీస్ రికార్డ్ (Service Record) ఆధారంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ పేర్లను సూచిస్తూ.. తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ (UPSC) తుది జాబితాను పంపనుంది. ఆ లిస్ట్ ఆధారంగానే రాష్ట్రానికి కొత్త డీజీపీని నియమించనున్నారు.
అయితే, రాష్ట్రంలో డీజీపీ పోస్ట్ (DGP Post)కు గాను మొత్తం ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌లు పోటీ పడుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రభుత్వం యూపీఎస్పీ (UPSC)కి పంపిన లిస్ట్‌లో 1990 బ్యాచ్ చెందిన రవి గుప్త (Ravi Gupta), 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ (CV Anand), 1994 బ్యాచ్‌కు చెందిన ఆప్టే వినాయక్ ప్రభాకర్ (Apte Vinayak Prabhakar), కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (Kothakota Srinivas Reddy), బి.శివధర్ రెడ్డి (Shivadhar Reddy), డా.సౌమ్య మిశ్రా (Soumya Mishra), శిఖా గోయల్ (Shikha Goyal) పేర్లు ఉన్నాయి. ఇక 1990 బ్యాచ్‌కు చెందిన రవి గుప్తాను రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ సర్కార్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన స్థానంలో డా.జితేందర్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక రవి గుప్తాకు ప్రభుత్వం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (Special Chief Secretary, Home Ministry) బాధ్యతలు కట్టబెట్టారు. సీనియర్ ఐపీఎస్‌లు అయిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇదే ఏడాది ఆగస్టు 5న, రవి గుప్తా డిసెంబర్ 19న, సీవీ ఆనంద్ 2028 జూన్‌లో, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్‌లో, బి.శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28న, డా.సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30న, శిఖాగోయల్ 2029 మార్చిన సర్వీస్ నుంచి రిటైర్ అవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీగా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.