Varsha Bollamma: క్రేజీ వీడియో షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. నీ క్రియేటివిటీ పీక్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్..

by Hamsa |
Varsha Bollamma: క్రేజీ వీడియో షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. నీ క్రియేటివిటీ పీక్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్..
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మొదట తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అక్కడ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక తెలుగులో ‘చూసి చూడంగానే’ అనే సినిమాతో వచ్చి వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక గత ఏడాది వర్ష బొల్లమ్మ ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలై ఘన విజయం సాధించింది.

ఇక ప్రస్తుతం వర్షకు అవకాశాలు రావపోడవంతో సోషల్ మీడియాకు పరిమితం అయింది. గత కొద్ది రోజుల నుంచి పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, వర్ష బొల్లమ్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ క్రేజీ వీడియోను షేర్ చేసింది.వెకేషన్‌కు వెళ్లిన వర్ష ఊరికే అలా ఉంటుందా.. ఏదో ఒక కోతి పని చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఎక్కడో ఓ చోట పర్యాటక ప్రదేశంలో సింహం నోటి నుంచి నీళ్లు వస్తున్నట్టుగా ఉంది. దానికి కొంచెం ముందుగా అలా దూరంలో నిలబడి.. అదేదో తన షవర్ బాత్ అన్నట్టుగా పోజులు పెట్టేసింది. ఇక ఆ షవర్ కిందే తాను స్నానం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాంపూ మర్చిపోయావ్, నీ క్రియేటివిటీ పీక్స్... నువ్వు ముందు డైరెక్టర్ అయి కామెడీ మూవీ చేయి అని పలు కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed