- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిజర్వేషన్లపై RSS చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో వివక్ష కొనసాగినంత కాలం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో కొన్ని వర్గాలను చాలా ఏళ్లుగా వెనుకే ఉంచుతూ వస్తున్నామని దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగుతున్నదన్నారు. అందువల్ల వెనుకబడిన వర్గాలకు పూర్తి స్థాయిలో సమానావకాశాలు దొరికేవరకు రిజర్వేషన్ల లాంటి ప్రత్యేక చర్యలు అవసరం అని వ్యాఖ్యానించారు. నాగ్ పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నేటి యువతరం వృద్ధులుగా మారకముందే అఖండ భారత్ లేదా అవిభాజిత భారతదేశం సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే భారత దేశం నుంచి విడిపోయిన వారు తప్పు చేశామని భావించే పరిస్థితులు వచ్చాయని అన్నారు. అయితే మరాఠా కమ్యూనిటీ ప్రజలు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న తరుణంలో రిజర్వేషన్ల అంశంపై మోహన్ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారాయి.