కాంగ్రెస్ సీఎంపై ప్రధాని మోడీ ప్రశంసలు

by Javid Pasha |
కాంగ్రెస్ సీఎంపై ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. అశోక్ గెహ్లాట్ తనకు మంచి మిత్రుడని మోడీ తెలిపారు. బుధవారం రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ గెహ్లాట్‌ను కొనియాడారు. సొంత పార్టీలో అంతర్గత విభేదాలున్నా, వాటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. తన ప్రసంగంలో సీఎం గెహ్లాట్ కేంద్రాన్ని కోరుతున్న కొన్ని డిమాండ్లను ప్రస్తావించిన ప్రధాని.. కాంగ్రెస్‌‌లో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలను సైతం ప్రస్తావించారు.

గెహ్లాట్ తన సొంత పార్టీలోనే సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను సైతం పక్కన పెట్టి గెహ్లాట్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని...ఈనాటి వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సైతం హాజరయ్యారని కితాబునిచ్చారు. గెహ్లాట్‌కు తాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

Advertisement

Next Story