Modi: గల్లీలో ఎవరున్నా డిల్లీలో ఆయనే ఉంటారు.. పాక్ అమెరిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Indraja |   ( Updated:2024-05-15 08:54:44.0  )
Modi: గల్లీలో ఎవరున్నా డిల్లీలో ఆయనే ఉంటారు.. పాక్ అమెరిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. వరుసగా రెండుసార్లు ఎర్రకోటపై బీజేపీ బావుటా ఎగరవేసి నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో 2024లో కూడా మోడీ ప్రధానిగా అధికారాన్ని చేపడతారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.

గల్లీలో ఎవరున్నా, డిల్లీలో ఆయనే ఉండాలి..

మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో పెనుమార్పులు చైటుచేసుకున్నాయి. 372 ఆర్టికల్ రద్దు చేసి, దేశమంతా ఒకటే రాజ్యాంగాన్ని అనుసరించేలా చట్టాన్ని తీసుకువచ్చారు. దేశంలో ఉగ్రవాధాన్ని రూపుమాపారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి 500 ఏళ్ల నుండి దేశ ప్రజలు కంటున్న కలను నెరవేర్చారు, ఇండియన్ ఆర్మీకి కావాల్సిన సధుపాయాలను అంధిస్తున్నారు.

అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ, అభివృద్దిపథంలో దేశాన్ని నడిపిస్తూ, ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూసేలా చేసిన ఘణత మోడీదేనని దేశంలో చాలామంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాణానికి బొమ్య, బొరుసు ఉన్నట్టే, మోడీని అభిమానించే వాళ్లతోపాటు వ్యతిరేకించేవాళ్లు కూడా దేశంలో ఉన్నారు. బీజేపీ మతపరమైన రాజకీయం చేస్తోందని మోడీని వ్యతిరేకించేవాళ్ల వాధన. ఈ నేపథ్యంలో పాక్ అమెరికన్ మోడీని ప్రశంసించడం గమనార్హం.

పాకిస్తాన్‌కు మోడీలాంటి నేత కావాలి..

పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ పాకిస్తాన్‌కు మోడీ లాంటి నేత కావాలని కోరారు. కాగా సాజిద్ తరార్ 90వ దశకంలో అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం తమ స్వదేశంలో పరిస్థితిని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపడితే అది ఇరుదేశాలకు మంచిదని పేర్కొన్నారు.

కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా సమర్థవంతుడైన నాయకుడని, ఆయన ఇరుదేశాల మధ్య బంధాన్ని పునరుద్ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలానే 2024 ఎన్నికల్లోను మళ్ళీ బీజేపీనే గెలుస్తుందని, భారత్‌లో మళ్ళీ మోడీ సర్కార్ వస్తుందని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story
null