- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలోకి బిహార్ ముఖ్యమంత్రి.. క్లారిటీ ఇచ్చిన అమిత్ షా!
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ప్రధాని పదవి కాంక్షతోనే ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారని ఆరోపించారు. శనివారం పశ్చిమ చంపారన్ జిల్లాలోని లారియా వద్ద జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. నితీష్ కుమార్ బిహార్ ను జంగల్ రాజ్ గా మార్చారని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్, ఆర్జేడీలను విమర్శించిన నితీష్ కుమార్ ఇప్పుడు పదవి కోసం వారి పంచాన చేరాడని ఆరోపించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీయే అధిక సీట్లను గెలుచుకున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ సీఎం పదవినీ నితీష్ కుమార్ కే ఇచ్చారని గుర్తు చేశారు. జేడీయూ, ఆర్‌జేడీల పొత్తు అపవిత్రమైనదని ఈ రెండు పార్టీల బంధం నూనె, నీరులాంటిదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిహార్ లో బీజేపీదే అధికారం అన్నారు. కాగా నితీష్ కుమార్ తిరిగి బీజేపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అమిత్ షా ఖండించారు. తమ మాజీ మిత్ర పక్షం జేడీయూతో బీజేపీ విసిగిపోయిందన్నారు. ఇక వారికి బీజేపీలోకి దారులు మూసుకుపోయాని స్పష్టం చేశారు.