- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుతో జూ.ఎన్టీఆర్ భేటీ.. ముహూర్తం ఫిక్స్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. గతమెంతో ఘనం అన్నట్లు ఇప్పుడు కనీసం పార్టీ కార్యక్రమాలను సైతం స్వేచ్ఛగా నిర్వహించుకునే చాన్స్ కూడా లేకపోయింది. సాక్షాత్తు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 40ఏళ్లు రాజకీయాలలో చక్రం తిప్పిన చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అయిపోయిందని.. దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనని పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అదే తరుణంలో పార్టీ పగ్గాలు తారక్‌కు అప్పగిస్తే టీడీపీకి పూర్వవైభవం వస్తోందని పలువురు సూచిస్తు్న్నారు. మరికొందరైతే లోకేశ్ కోసం తారక్‌ను చంద్రబాబు తొక్కేశారని ఆరోపిస్తున్నారు. ఇక తారక్ చంద్రబాబుతో కలిసి రాజకీయం చేయరంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడును కలవబోతున్నారు అనే వార్త తెలుగు తమ్ముళ్లో ఉత్సాహం నింపుతోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తారక్ మావయ్య చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. మావయ్యను సీఎంగా చేసేందుకు తారక్ కంకణం కట్టుకున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యాచరణ కోసం కలవబోతున్నారా? లేక కుటుంబ వ్యవహారాల కోసమే కలుస్తున్నారా అనేదానిపై అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు పొలిటికల్ సర్కిల్‌లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంది.
తారక్ భేటీపై ఉత్కంఠ
టాలీవుడ్ అగ్రనటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూ.ఎన్టీఆర్ టాలీవుడ్‌లో మాస్ హీరోగా నిలదొక్కుకున్నారు. అనతి కాలంలోనే అగ్రహీరోల సరసన చేరిపోయారు. తన డైలాగ్ డెలీవరీలతో.. మాస్ స్టెప్పులతో అదరహో అనిపించారు. తాత నందమూరి తారకరామరావును తన హావాభావాలతో మైమరపిస్తూ తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. సినిమాలో నటించడం తప్ప వేరే అంశాలపై అంతగా పెదవి విప్పని తారక్ మాత్రం నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటారు. టీడీపీ పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీలోని కొందరు నేతలతోపాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు సైతం కోరుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ వల్లే టీడీపీ బతికబట్టకట్టగలుగుతుంది అంటూ చెప్తున్నారు.
మరోవైపు లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు తారక్‌ను తొక్కేస్తున్నారంటూ వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇలా టీడీపీలోనూ అటు బయట చంద్రబాబుకు అనుకూలంగా కొందరు.. తారక్‌కు అనుకూలంగా మరికొందరు విడిపోయారు. నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తారక్ స్పందించన తీరును తెలుగు తమ్ముళ్లు కొందరు తప్పుబట్టగా మరికొందరు తొక్కేసినా సరే స్పందించారు సంతోషించండి అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో చంద్రబాబును కలవబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు చంద్రబాబు నివాసమే వేదిక కానుందని తెలుస్తోంది. జనవరి 10న హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో తారక్ ప్రత్యేకంగా కలవ బోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఎన్నికల ప్రచారం కొత్తేమీ కాదు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తారక్ భేటీ రాజకీయ పరంగానా లేక కుటుంబం పరమా లేక సినిమాకు సంబంధించినదా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజకీయంగా భేటీ అయితే ఇక వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై చర్చిస్తారని అందుకు సంబంధించిన కాల్షీట్లు.. డేట్లపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం తారక్‌కు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ను ఓడించేందుకు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపారు. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయించారు. రాష్ట్రమంతటా పర్యటించారు. తారక్ పర్యటనకు జనం జేజేలు పలికారు. విపరీతంగా జనం వచ్చేవారు. చిన్న వయసులోనే అయినప్పటికీ తారక్ తన మాటల డైలాగులతో తాత నందమూరి తారకరామావును మైమరపించేవారు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి మెుదలుకుని నాటి రాజకీయ నాయకులపై విమర్శల దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతె జాతీయ రహదారి మలుపు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే.
లోకేశ్ కోసమే తారక్‌ను పక్కనపెట్టారా?
2009 ఎన్నికల ప్రచారం అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు కావాలనే దూరం పెడుతున్నారా అని ప్రచారం జరుగుతుంది. అందుకే మహానాడుకు గానీ ఇతర పార్టీ కార్యక్రమాలకు తారక్‌ను ఆహ్వానించరని ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం తారక్‌ను పక్కన పెట్టారనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. వాస్తవానికి జూ.ఎన్టీఆర్‌కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. 2009 ఎన్నికల నాటికే అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు 40వ ఏట అడుగుపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ మాటలు వింటే ఓరేంజ్‌లో ఉంటాయి. ఒక హీరోగానే కాకుండా సామాజిక అంశాలపై ఎంతో అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడు గనుక తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే చంద్రబాబు, లోకేశ్‌లు పక్కకు వెళ్లిపోవాల్సిందేనంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. అందువల్లే చంద్రబాబు నాయుడు తారక్‌ను పక్కనపెట్టి తన రాజకీయ వారసుడిగా కొడుకు నారా లోకేశ్‌ను తీసుకొచ్చారని అంతేకాదు ఏకంగా మంత్రిని కూడా చేశారని చెప్తుంటారు.
లోకేశ్ మాజీ సీఎం చంద్రబాబు తనయుడిగా తప్ప ప్రత్యేకంగా పెద్ద ఇమేజ్ ఏమీ లేదు.. కానీ ఇప్పుడిప్పుడే పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో తారక్ రాజకీయ ఆరంగేట్రం లోకేశ్‌కు ఇబ్బందికరమని చంద్రబాబు భావించారని అందుకే ఆయన్ను పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చంద్రబాబు కుప్పం పర్యటనలో అయితేనేమీ.. అనంతపురం పర్యటనలో.. ఇలా అనేక చోట్ల తారక్ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ సమయంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారే కానీ తారక్ వస్తారని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎక్కడా ప్రకటించకపోవడం గమనార్హం. మెుత్తానికి తారక్ చంద్రబాబుతో భేటీ అవుతారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెట్టిస్తున్నాయి. మరి ఈ భేటీ అనేది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.
Read more:
తప్పు చేసిన వాళ్ల బట్టలు విప్పి నడిరోడ్డుపై తిప్పుతా.. చంద్రబాబు ఆగ్రహం