- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లగొండలో టీఆర్ఎస్‌కు భారీ షాక్.. తెలంగాణ తల్లి సాక్షిగా ముకుమ్మడి రాజీనామా
దిశ, తుర్కపల్లి(ఎం): మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తోన్న వేళ నల్లగొండలో అధికార టీఆర్ఎస్‌కు భాక్ తగిలింది. నల్లగొండ జిల్లా తుర్కప్లలి(ఎం) మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పార్టీకి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలం నుండి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 మందికి పైగా రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుల ప్రజావ్యతిరేక విధానాల వల్లే తాము పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యేపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామాలు చేసిన వారిలో మండల మహిళా అధ్యక్షురాలు మేకల లావణ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు బర్ల లచ్చయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు జంగిటి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి భానోత్ శత్రు నాయక్, మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బన్సీ నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు మాడిశెట్టి శ్రీను, పట్నం భిక్షపతి, చిలుకురి రమేష్, రాక్యల రమేష్, భాస్కర్ యాదవ్, అనిల్, కనకరాజు తదితరులు ఉన్నారు.