KCR సంచలన ఆదేశాలు.. బైక్స్ ఆపి వాట్సాప్ చెక్ చేస్తున్న పోలీసులు (వీడియో)

by Anukaran |
KCR సంచలన ఆదేశాలు.. బైక్స్ ఆపి వాట్సాప్ చెక్ చేస్తున్న పోలీసులు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా బండితో రోడ్డెక్కితే చలాన్లు, కేసులు తప్పవు. అయితే, ఇన్ని రోజులు పోలీసులు చెక్ చేస్తున్నారంటే చాలు ఏ ఒక్క పేపర్ లేకున్నా చలాన్లు మాత్రమే పడేవి. అంతేకాకుండా పోలీసులు రాత్రి వేళలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిని పట్టుకునే పనిలో ఉండటం చూస్తుంటాం. అయితే, తాజాగా పోలీసులు వారి రూట్ మార్చారనే చెప్పాలి.

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దాలని పోలీసు, ఎక్సైజ్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడం తెలిసిందే. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి డీలింగ్ జరుగుతోందని పరిశీలనలో తెలిసినట్లు చెప్పారు.

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులు, యువకుల వాట్సాప్‌లను చెక్ చేసే పనిలో పడ్డారు. దీని కోసం పోలీసులు వాహన తనిఖీల పేరిట వాహనదారుల వాట్సాప్‌లను చెక్ చేస్తూ నగరంలో దర్శనమిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలుచోట్ల ఈ ప్రక్రియ మొదలైంది. వీరు ముఖ్యంగా వాహనాలను తనిఖీ చేసిన తర్వాత వాట్సాప్‌లో ‘గంజాయి’ అని టైప్ చేసి సర్చ్ చేయమంటారు. లేకపోతే పోలీసులే స్వయంగా వాట్సప్ చెక్ చేస్తారు.

ఈ క్రమంలో వారికి ఏదైనా అనుమానాస్పద చాట్ కనిపిస్తే వారిని వెంటనే అరెస్ట్ చేస్తారు. అలాంటిదేమీ లేకపోతే వదిలేస్తారు. అయితే.. ఈ చెకింగ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది కేవలం డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చడంలో భాగమేనని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed