- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేలం పాటను అడ్డుకున్న పోలీసులు.. ఎందుకంటే..?
దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఆదివారం అనధికారికంగా కల్లు దుకాణానికి వేలం నిర్వహించేందుకు సర్పంచ్‌తో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రయత్నించారు. కాగా వేలం విషయాన్ని తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు గ్రామానికి చేరుకొని అడ్డుకున్నారు. కల్లు దుకాణానికి వేలాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతేకాకుండా, గ్రామ పంచాయతీ కార్యాలయం, కల్లు దుకాణం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 9న “దిశ” పేపర్‌లో వచ్చిన ‘సర్పంచ్ అధికార దుర్వినియోగం’ అనే కథనానికి ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. గ్రామంలో కల్లు దుకాణానికి టెండర్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కల్లు దుకాణాలకు టెండర్లు వేస్తే చర్యలు తప్పవు..
గ్రామాల్లో కల్లు దుకాణాల కోసం టెండర్లు వేస్తే చర్యలు తప్పవు. లైసెన్సులు ఉన్నవారు కల్లు విక్రయించుకోవాలి. దుకాణాలు పెట్టి టెండర్లు వేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ఇస్రోజివాడి గ్రామంలో టెండర్ వేసేందుకు యత్నిస్తున్నారని దిశ వెలుగులోకి తీసుకురావడంతో వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాము. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కేసు నమోదు చేస్తాం -ఎక్సైజ్ సీఐ ఫణీందర్ రెడ్డి