ప్రముఖ కవి యాకుబ్‌కు అమెరికా తెలుగు అసోసియేషన్‌ నుండి అవార్డ్..

by Sridhar Babu |
yakub
X

దిశ, కారేపల్లి: ప్రముఖ కవి యాకుబ్‌ సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా) నుండి ఆవార్డును అందుకున్నారు. ఆటా 17వ సభల సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులకు అవార్డులను ప్రకటించింది. దీనిలో రొట్టమాకురేవు కవిగా ప్రసిద్ధి చెందిన యాకుబ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆటా ప్రతినిధులు ఆయనకు అవార్డ్‌ను అందజేశారు. సాహిత్య రంగంలో కవి యాకూబ్‌ చేస్తున్న కృషిని గుర్తించిన ఆటా ప్రతినిధులు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

పల్లెలు సాహిత్య కేంద్రాలు కావాలనే ఆకాంక్షతో తన స్వగ్రామం రోట్టమాకురేవులో కేఎల్‌ పుస్తక సంగం పేరుతో యాకుబ్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి ఏడాది రొట్టమాకురేవు కవిత్వ అవార్డు పేరుతో తన తండ్రి షేక్‌ మహమ్మద్‌ మియా, జీవితంలో ఆసరా నిలిచిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ నర్సింహరావు, ప్రోత్సహించిన మామ పురిటిపాటి రామిరెడ్డి పేరిట స్మారక అవార్డులను ముగ్గురు కవులకు అందిస్తున్నారు. సాహిత్యరంగానికి సేవలు అందించటమే కాకా వివిధ సేవా కార్యక్రమాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed