ఇండియన్ మార్కెట్‌లోకి పోకో ఎం2 ప్రో

by Harish |
ఇండియన్ మార్కెట్‌లోకి పోకో ఎం2 ప్రో
X

మొబైల్స్ మనుఫ్యాక్చరింగ్ కంపెనీ పోకో.. ఇండియాలో పోకో ఎం2 ప్రొ పేరిట ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగ‌ళ‌వారం విడుదల చేసింది. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు, సిమ్ కార్డుల కోసం ప్ర‌త్యేకంగా విడివిడిగా స్లాట్ల‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌కు ఫాస్ట్ చార్జ‌ర్‌ను అందిస్తున్నారు. పోకో ఎం2 ప్రో రెండు వేరియంట్లలో లభించనుంది. జూలై 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడ‌ల్స్‌ను విక్ర‌యించ‌నున్నారు.

పోకో ఎం2 ప్రో ఫీచర్స్ :

డిస్‌ప్లే – 6.67 ఇంచులు

ప్రాసెస‌ర్ – స్నాప్‌డ్రాగ‌న్ 720జి

ర్యామ్‌ – 4 జీబీ

స్టోరేజ్‌ – 128 జీబీ

ఓ ఎస్ – ఆండ్రాయిడ్10.0

ఫ్రంట్ కెమెరా – 16 మెగాపిక్సల్

రేర్ కెమెరా – 48ఎంపీ +8+5+2

బ్యాట‌రీ – 5,020 ఎంఏహెచ్

పోకో ఎం2 ప్రొకు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.13,999గా ఉంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999గా ఉంది

Advertisement

Next Story

Most Viewed