మేము అయితే మాస్కులు పెట్టుకోం.. నువ్వే కాపాడాలి పోచమ్మ తల్లి..!

by Aamani |
మేము అయితే మాస్కులు పెట్టుకోం.. నువ్వే కాపాడాలి పోచమ్మ తల్లి..!
X

దిశ, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ప్రజలకు అత్యవసర పరిస్థితులు, నిత్యావసరాల కోసం నాలుగు గంటలు మినహాయింపు ఇచ్చారు. అయితే, కొందరు మాత్రం ఆ సమయంలో ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.

తాజాగా కరోనా మహమ్మారి త్వరగా వెళ్లిపోవాలని ఆసిఫాబాద్ పట్టణంలోని రాజంపేట, తారకరామ నగర్, నగపూరి వాడ కాలనీలకు చెందిన మహిళలు ఆదివారం రోజున ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వ్యాప్తి తగ్గిపోయేలా చేయాలని పోచమ్మ తల్లిని వేడుకుంటూ బోనాలు సమర్పించారు. అయితే, పూజలో పాల్గొన్న మహిళలు ఒక్కరు మినహా ఎవరూ మాస్కులు ధరించని దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి భక్తి ఉంటే చాలు భయం లేకున్నా కరోనా ఏమీ చేయలేదు అనే సందేశాన్ని వీరు చేరవేస్తున్నారా అనే అనుమానం కలుగకమానదు.

Advertisement

Next Story

Most Viewed