- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి వయస్సు త్వరలోనే నిర్ణయిస్తాం: ప్రధాని
దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు కనిష్ట వివాహ వయసును త్వరలోనే సవరిస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళల వివాహానికి సరైన వయసుపై ముఖ్యమైన చర్చ నడుస్తున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు ఈ విషయమై తనకు లేఖలు రాస్తూ ఆరా తీస్తున్నారని చెప్పారు. కమిటీ రిపోర్టు అందగానే మహిళలకు కనిష్ట వివాహ వయసును నిర్ణయిస్తామని తెలిపారు.
ఎఫ్‌ఏవో 75వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 75 నాణెం విడుదల
ఐరాసకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో)తో భారత్‌కు ఉన్న దీర్ఘకాల బంధాన్ని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఎఫ్ఏవో 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని రూ. 75 నాణేన్ని విడుదల చేశారు. ఆహార భద్రత చట్టం ప్రాధాన్యతనూ వివరించారు. కనీస మద్దతు ధర, పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం ద్వారానే కరోనా లాంటి మహమ్మారి కాలంలో ప్రజలకు ఆహార భద్రత కల్పించడం సాధ్యపడిందని అన్నారు. రైతుల ఆదాయాలు పెరిగితే పౌష్టికాహారలోపాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని వివరించారు.