జూలై 12 నుంచి పీజీ తరగతులు

by Shyam |
జూలై 12 నుంచి పీజీ తరగతులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ తర్వాత అకాడమిక్ ఇయర్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిద్ధమైంది. సెమిస్టర్లు, కొత్త అడ్మిషన్ల కోసం మంగళవారం అకాడమిక్ క్యాలెండర్ తేదీలను కూడా ప్రకటించింది. ఇప్పటికే చదువుతున్న పీజీ విద్యార్థులకు జూలై 12 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్టు హెచ్‌సీయూ స్పష్టంచేసింది. రెండు వారాల తర్వాత అనగా ఆగస్టు 3వ తేదీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనుంది. పీజీ ప్రొవిజనల్ ఫలితాలను జూన్ 16న, ఆప్షనల్ ఫలితాలను జూలై 4న ప్రకటించినున్నట్టు వివరించింది. కొత్త సెమిస్టర్ తరగతులు ఆగస్టు 12 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపింది. కొత్త అడ్మిషన్ల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు మే 22ను చివరి తేదీగా ఖరారు చేసినా, హైదరాబాద్ వర్శిటీ ప్రవేశ పరీక్షలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనుంది. ఆగస్టు చివరికల్లా కొత్త కోర్సులకు ప్రవేశాల ప్రక్రియను ముగించి, సెప్టెంబరు 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్టు హెచ్‌సీయూ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story