- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎంపీటీసీల గోడు ప్రభుత్వానికి పట్టదా’
దిశ, భూపాలపల్లి : ఎంపీటీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎంపీటీసీలు వినతి పత్రం ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ వేం వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎంపీటీసీలు గా గెలిచి రెండు సంవత్సరాలు గడిచినా నిధులు, విధులు, అధికారాలు కల్పించుటలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని వాపోయారు. గ్రామంలో అనుభవిస్తున్న అవమానాలు, ప్రోటోకాల్ ఉల్లంఘన వంటివి జరుగుతున్నా పట్టించుకోని అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలని, ఎంపీటీసీల సమస్యలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు విడిదినేని అశోక్, దబ్బెట అనిల్, బుర్ర దేవేందర్ గౌడ్, కుమార్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Latest News
- mptc