కమిషన్ దగ్గరకే వెళ్ళండి : సుప్రీంకోర్టు

by Shyam |
కమిషన్ దగ్గరకే వెళ్ళండి : సుప్రీంకోర్టు
X

‘దిశ’ నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఆ కుటుంబాలన్నీ కలిపి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ‘దిశ’ ఎన్‌కౌంటర్ సంఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ ఏర్పాటైనందున అన్ని అంశాలను ఆ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలని సూచించింది. ఎలాగూ ఆరు నెలల వ్యవధిలో ఆ కమిషన్ నివేదిక సమర్పిస్తుందని, దానిపట్ల అసంతృప్తి ఉన్నా, ఇతర అంశాలేవైనా ఉంటే అప్పుడు సుప్రీంకోర్టును సంప్రదించవచ్చని పిటిషనర్లకు సూచించింది. ఎన్‌కౌంటర్ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిందితుల కుటుంబాలకు తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు.

ముగ్గురు సభ్యుల కమిషన్ నివేదిక రూపొందించిన తర్వాత సైతం.. ఈ కుటుంబాలు సంప్రదించి తగిన ఆధారాలను సమర్పించే వెసులుబాటు ఉందని పిటిషనర్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తగిన న్యాయం జరగలేదని భావించిన పక్షంలో ఎప్పుడైనా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.

Advertisement

Next Story