‘జలవిద్యుత్ ఉత్పాదనకు అనుమతులివ్వండి’

by srinivas |
‘జలవిద్యుత్ ఉత్పాదనకు అనుమతులివ్వండి’
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో జలవిద్యుత్ ఉత్పాదనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్‌లలో నీటిమట్టం పెరుగుతోందని లేఖలో పేర్కొంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని లేఖలో ప్రస్తావించారు.

ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 870 అడుగలకు చేరిందని కేఆర్ఎంబీకు తెలిపారు. ఈ నేపథ్యంలో కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో జలవిద్యుత్‌ ఉత్పాదనకు అనుమతివ్వాలని లేఖలో అధికారులు కోరారు. విభజన చట్టం ప్రకారం నీటిమట్టం పెరిగితే.. జలవిద్యుత్‌ ఉత్పాదన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని…దాని ప్రకారం అనుమతివ్వాలని ఏపీ జలవనరుల శాఖ కేఆర్ఎంబీని కోరింది.

Advertisement

Next Story

Most Viewed